ఎం.కె వల్లాపురంలో బంగారం, వెండి చోరీ
మాడుగుల: మండలంలో ఎం.కె. వల్లాపురంలో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంట్లో ప్రవేశించి ఐదు తులాలు బంగారం, 10 తులాల వెండి చోరీ చేశారు. ఎస్‌ఐ నారాయణరావు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలు... గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మట్టా మహలక్ష్మి నాయుడు, భవన నిర్మాణపని చేస్తున్న ఆయన భార్య రాము తమ పనులపై బయటకు వెళ్లగా, ఇద్దరు పిల్లలు పాఠశాలకు వెళ్లారు. దీంతో ఇంట్లో ఎవరూ లేరన్న విషయాన్ని గమనించిన దొంగలు కిటికీలోంచి ఇంటిలోకి ప్రవేశించి బీరువాలో ఉన్న 5 తులాల బంగారం, 10 తులాల వెండి దొంగలించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తెలిసిన వారి అండతోనే దొంగతనం జరిగి ఉంటుందని ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.


