అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్‌లో హైమావతి ప్రతిభ
అచ్యుతాపురం రూరల్ : అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లోలో నునపర్తి గ్రామా నికి చెందిన జూరెడ్డి హైమావతి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. బీహార్ రాష్ట్రం పాట్నాలో గత నెల 27 నుంచి 29 వరకూ బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన సౌత్ ఏషియన్ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారతదేశం తరఫున హైమవతి పాల్గొని సత్తా చాటారు. ఈ సందర్భంగా ఆమెను విశాఖపట్నం జిల్లా బాల్ బ్యాడ్మింటన్ ప్రధాన కార్యదర్శి గొంప నర్సింహమూర్తి, నునపర్తి శ్రీరామ బాల్ బ్యాడ్మింటన్ క్లబ్ చైర్మన్ ఆర్.వి.వి.నగేష్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


