జిల్లా పోలీస్ కార్యాలయానికి ఫార్మా కంపెనీల చేయూత
అనకాపల్లి: జిల్లాలోని మాన్‌కై ండ్, లుపిన్, వసుధ ఫార్మా కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) నిధులతో జిల్లా పోలీస్ కార్యాలయానికి జనరేటర్, కంప్యూటర్ వస్తువులను కొనుగోలు చేశామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనరేటర్‌ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ కార్యాలయంలోపాలనా పరమైన పనులు వేగవంతంగా, ఆటంకం లేకుండా సాగడానికి వీలుగా పరవాడలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు అందించిన సహకారం మరువలేనిదన్నారు. మాన్ కై ండ్ ఫార్మా సీఎస్‌ఆర్ నిధులతో భారీ జనరేటర్, లుపిన్, వసుధ ఫార్మా కంపెనీలు కంప్యూటర్లు, యూపీఎస్‌లు సమకూర్చాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, మాన్ కై ండ్ ఫార్మా ప్రతినిధులు రామలింగం, శ్రీనరేష్, లుపిన్ ఫార్మా ప్రతినిధులు గంగరాజు, వెంకట్, వసుధ ఫార్మా ప్రతినిధులు రామరాజు, హర్ష, ఎస్‌బీ డీఎస్పీ జి.ఆర్.ఆర్.మోహన్, తమలంపూడి.లక్ష్మి, లక్ష్మణమూర్తి, బాలసూర్యారావు, మల్లికార్జునరావు, రామకృష్ణారావు, మన్మథరావు, ఎస్‌ఐలు ప్రసాద్, రమణయ్య, సురేష్ బాబు, శిరీష, ఐటీ కోర్ శ్రీధర్ పాల్గొన్నారు.


