పూర్వవిద్యార్థుల శ్రమదానం
బడికి రక్షణ కంచె ఏర్పాటు
ముంచంగిపుట్టు: తాము చదువుకున్న పాఠశాలకు రక్షణ కంచె లేకపోవడంతో పాఠశాల పూర్వ విద్యార్థులు చొరవ తీసుకుని ఏర్పాటు చేశారు. మండలంలో కించాయిపుట్టు పంచాయతీ రాము లు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు రక్షణ కంచె లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతుండడాన్ని గుర్తించిన పూర్వ విద్యార్థులు పల్లుల వెంకటరమణ, ముంచంగి మధు,మఠం తిరుపతి, వల్లంగి గంగమూర్తి, పల్లుల సుబ్బారావు, కిల్లో బాలకృష్ణ, సంగల సత్తిబాబు,సంగుల దేవన్న,పల్లుల ఆజాద్, పాఠశాల హెచ్‌ఎం లింగన్నలు కొంత సొమ్ముతో పాటు చందాలు వేసుకుని సేకరించిన నగదుతో ఇనుప కంచెను కొనుగోలు చేశారు. రెండు రోజులుగా శ్రమదానంతో గోతులు తవ్వి, కర్రలు పాతిపెట్టి,రక్షణ కంచెను ఏర్పాటుచేశారు.అనంతరం పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. దీంతో పూర్వ విద్యార్థులను ఉపాధ్యాయులు,రాముల గ్రామస్తులు అభినందించారు.


