వైద్య విద్యార్థుల క్రీడా పోటీలు ప్రారంభం
9న వైద్య కళాశాల వార్షికోత్సవం
సాక్షి, పాడేరు: జిల్లా కేంద్రం పాడేరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి.వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభించి ఈనెల 9వ తేదీనాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆరోహన్ పేరిట మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి,రెండవ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న 100 మంది వైద్య విద్యార్థులకు నిర్వహిస్తున్న క్రీడా పోటీలను వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.హేమలతాదేవి ప్రారంభించారు. క్రీడా జ్యోతిని వెలిగించి వైద్య విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులు క్రీడా జ్యోతితో కళాశాల ప్రాంగణంలో ఉత్సాహంగా పరుగులు తీశారు. అనంతరం వైద్య విద్యార్థులకు క్రికెట్, కబడ్డీ పోటీలను ప్రిన్సిపాల్ హేమలతాదేవితో పాటు వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ పాపారత్నం,డాక్టర్ లక్ష్మీకుమారి తదితరులు ప్రారంభించారు.ఈ నెల ఈ పోటీలు జరుగుతాయి.
వైద్య విద్యార్థుల క్రీడా పోటీలు ప్రారంభం


