గంజాయికి దూరంగా ఉండాలి
అరకులోయటౌన్: గంజాయి సాగు, రవాణా, వినియోగానికి అందరూ దూరంగా ఉండాలని ఎంపీ, భారత మాజీ క్రికెటర్ యాసఫ్ పఠాన్ తెలిపారు. సోమవారం పార్లమెంటరీ స్టాండింగ్ కామర్స్ కమిటీ సభ్యులతో కలిసి ఆయన అరకులోయను సందర్శించారు. ఈ సందర్భంగా పాడేరు డీఎస్పీ అభిషేక్‌తో కలిసి సే నో టు గంజా అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించి, గంజాయి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గంజాయికి బానిసలై భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దన్నారు. గంజాయికి బదులుగా కాఫీ, మిరియాలు వంటి పంటలను ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. అనంతరం గిరిజన మ్యూజియం, కాఫీ హౌస్‌ను ఎంపీ సందర్శించారు. అరకు ప్రాంత అభివృద్ధికి కేంద్రప్రభుత్వం సహకారం అందించేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాడేరు డీఎస్పీ అభిషేక్ , అరకు సీఐ ఎల్.హిమగిరి, ఎస్‌ఐ పి. గోపాలరావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ యాసఫ్ పఠాన్


