అటవీప్రాంతంలో సిరి గంధం చెట్ల నకిరివేత
జి.మాడుగుల: మండలంలోని కుంబిడిసింగి పంచాయతీ ఉర్లమెట్ట, గద్దరాయి గ్రామాల సమీపంలో అటవీ ప్రాంతంలో గల సిరి గంధం చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి, అపహరించుకు పోయిన విషయం ఆలస్యంగా తెలిసింది. ఈ గ్రామాలకు ఆనుకుని ఉన్న కొండలపై విలువైన సిరి గంధం చెట్లను శనివారం రాత్రి నరికి అపహరించుకుపోయినట్టు తెలుస్తోంది. గమనించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి సమాచారం అందించారు. ఫారెస్టు అధికార్లు సోమవారం అటవీ ప్రాంతానికి వెళ్లి, విచారణ జరిపారు.అటవీ సంపదను దోచుకుంటున్న వారిపై చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు.


