చోరీ సొత్తు స్వాధీనం
ఎస్.రాయవరం : తిమ్మాపురం చర్చిలో చోరీకి పాల్పడిన దుండగులను పట్టుకుని చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు నరీపట్నం డీఎస్పీ పి. శ్రీనివాసరావు తెలిపారు. అడ్డురోడ్డు సర్కిల్ కార్యాలయంలో సోమవారం డీఎస్పీ స్థానిక విలేకర్లతో మాట్లాడారు. తిమ్మాపురం చర్చిలో జనవరి 1న చోరీకి పాల్పడిన దొంగను పట్టుకుని అతని వద్ద నుంచి చోరీ చేసిన వస్తువులు స్వాధీనం పరచుకున్నారు. చర్చి పాస్టర్ బి.డి. కిరణ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్.రాయవరం పోలీసులు దర్యాప్తు చేసి తక్కువ సమయంలో నిందితుడిని పట్టుకున్నారన్నారు. చర్చిలో వినియోగించే పబ్లిక్ అడ్రస్ ఇన్ సిస్టం, సౌండ్ మిక్సర్, లాంగ్ పియానో సుమారు రూ.లక్షా 10 వేలు విలువ గలిగిన వస్తువులు చోరీ అయినట్టు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. ఈ సమావేశంలో డీఎస్పీ వెంట సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ విభీషణరావు ఉన్నారు.


