బెదిరించి బంగారం అపహరించిన మహిళ అరెస్టు
బంగారం, నగదు దొంగలించిన మహిళను
అదుపులోకి తీసుకున్న పోలీసులు
పాయకరావుపేట : మండలంలో సీతారాంపురం గ్రామానికి చెందిన మహిళ సోమవారం ఆటోలో ప్రయాణిస్తుండగా స్థానిక పెట్రోల్ బంక్ సమీపాన తన 7 తులాల బంగారం, 5 వేల నగదు అపహరణకు గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాడుగుల గ్రామానికి చెందిన రావుల పోచమ్మ అను మహిళ ఫిర్యాదురాలిని బెదిరించి బంగారం, నగదు తీసుకెళ్లిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొనడంతో ఆ మేరకు గాలించి నిందితురాలిని పోలీసులు పట్టుకున్నారు. ఆమెను అరెస్టు చేసి, బంగారం స్వాధీనం చేసుకుని యలమంచిలి కోర్టుకు తరలించగా రిమాండ్ విధించినట్టు సీఐ జి.అప్పన్న తెలిపారు.


