అర్జీదారులకు ఉచిత వాహన సౌకర్యం
కలెక్టరేట్ నుంచి జాతీయ రహదారికి అర్జీదారులను తీసుకెళ్తున్న ఉచిత ఆటో
తుమ్మపాల : వివిధ సమస్యలపై ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చే వృద్ధులు, వికలాంగులు, మహిళలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే ఉచిత వాహన సౌకర్యం ఏర్పాటు చేశారు.పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో మండలంలో శంకరం గ్రామంలో ఉన్న కలెక్టరేట్‌కు చేరడానికి ఆపసోపాలు పడుతున్న అర్జీదారులకు ఉచిత వాహన సౌకర్యం కలిగిస్తూ ఏడు వారాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆటో తిరుగుతుంది. జాతీయ రహదారి నుంచి సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న కలెక్టరేట్‌కు రావాలంటే ప్రయాణ సౌకర్యం లేదు. వాహనాలు లేని వృద్ధులు, వికలాంగులు నడవలేని పరిస్థితిలో ప్రత్యేక ఆటోకు ఖర్చు చేయలేక పేదలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రతి వారం ఉచితంగా ఆటోసేవను కొనసాగిస్తున్నట్టు పార్టీ నాయకులు తెలిపారు.


