ఆర్టీసీ కాంప్లెక్స్‌లో వృద్ధుడు మృతి
యలమంచిలి రూరల్: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సోమవారం గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. బస్టాండులో వెయిటింగ్ బెంచీపై విగతజీవిగా పడివున్న వృద్ధుడ్ని గుర్తించిన కొందరు ప్రయాణికులు పట్టణ పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన పోలీసులు వృద్ధుడు మృతి చెందినట్టు నిర్థారించుకుని మృతదేహాన్ని అనకాపల్లి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గాంధీనగరం వీఆర్వో పలక పృధ్వి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఎస్‌ఐ కె.సావిత్రి తెలిపారు.


