దేవరాపల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం
దేవరాపల్లి: దేవరాపల్లిలో ఆదివారం రాత్రి పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో అటుగా వెళ్తున్న దేవరాపల్లికి చెందిన వెలమరెడ్డి చిట్టినాయుడుపై పిచ్చి కుక్క దాడి చేసి కుడి చేయి, కుడి కాలిపై తీవ్ర గాయాలు చేసింది. వెంటనే స్థానికులు గమనించి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చేతిపై గాయానికి ఐదు కుట్లు వేశారు.దేవరాపల్లిలో వీధి కుక్కల బెడదతో పాటు పిచ్చి కుక్కల స్వైర విహారంతో స్థానిక ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
పిచ్చి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడ్డ చిట్టినాయుడు


