తప్పుడు సర్వే నంబర్‌తో నిషేధిత భూమి రిజిస్ట్రేషన్
డీపట్టా భూమిని ఆక్రమించేందుకు తప్పుడు సర్వే నంబర్‌తో చేసిన రిజిస్టర్డ్ దస్తావేజును రద్దు చేసి, ఆక్రమణదారుల నుంచి భూమిని కాపాడాలంటూ అనకాపల్లి మండలం రేబాక గ్రామానికి చెందిన డీ–పట్టాదారుడు వనమాల నాగభూషణం కోరారు. నిరుపేద దళితుడినైన తన పేరున 30 ఏళ్ల క్రితం ప్రభుత్వం సర్వే నంబర్ 75/1లో 30 సెంట్లు డీపట్టా మంజూరు చేసిందని, అప్పటి నుంచి సాగు చేసుకుంటున్న భూమిని ఆక్రమించేందుకు గ్రామంలో కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తన పేరున పట్టాదారు పాసు పుస్తకం ఉన్నప్పటికి ఆన్‌లైన్ చేయకుండా చేసి, నా భూమికి ఆనుకుని ఉన్న మరో సర్వే నెం.75/2తో పోర్జరీ పత్రాలు సృష్టించి చేసిన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని కోరారు.


