ల్యాండ్‌పూలింగ్ రైతుల నిరసన
తుమ్మపాల: ల్యాండ్ పూలింగ్ ద్వారా తమ భూములను తీసుకుని తమకు కేటాయించాల్సిన ప్లాట్‌లను నేటికీ మంజూరు చేయడం లేదని పాపయ్యపాలెం గ్రామంలో చేపడుతున్న జగనన్న కాలనీ వద్ద బాధిత రైతులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ డీ పట్టాల ద్వారా ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను గత ప్రభుత్వంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వం సేకరించి తమకు ఒక్కో ఎకరానికి 18 సెంట్ల ప్లాట్‌లు హామీ ఇచ్చిందని, తీసుకున్న భూముల్లో కాలనీలు నిర్మాణం పూర్తి చేస్తున్నప్పటికీ తమకు మాత్రం ప్లాట్‌లు ఇవ్వకుండా తాత్సరం చేస్తున్నారని, అన్నారు. ప్లాట్‌లు కేటాయించి రిజిస్ట్రేషన్లు జరగకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకుందని, అధికారులు సీఐడీ విచారణ పేరుతో తీవ్ర జాప్యం చేస్తున్నారన్నారు. నాలుగేళ్లగా అనేక పోరాటాలు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని, తమ భూముల్లో చేపడుతున్న నిర్మాణాలను నిలిపివేయాలని కోరితే కేసులు పెడతామంటూ భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


