చోరీకి గురైన ట్రాక్టర్ పట్టివేత
రావికమతం : కొత్తకోటలో దొంగిలించిన ట్రాక్టర్‌ను స్వాధీనం పర్చుకొని, దొంగతనం చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్డు చేసి, రిమాండ్‌కు తరిలించినట్టు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. కొత్తకోట బి.ఎన్.రోడ్డు పక్కన ఉంచిన గుర్రాల నాగలక్ష్మి చెందిన ట్రాక్టర్‌ను నవంబర్ 23న రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. దీనిపై నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కొత్తకోట పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరిపారు. సోమవారం బి.ఎన్.రోడ్డులో దొండపూడి చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానస్పందంగా సంచరిస్తున్న కాకినాడ జిల్లా జగ్గంపేట దగ్గర నెహ్రూనగర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా కొత్తకోటలో నాగలక్ష్మికి చెందిన ట్రాక్టర్‌ను దొంగిలించినట్టు వారు అంగీకరించారు. వారి చెప్పిన వివరాల మేరకు ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని కొత్తకోట స్టేషన్‌కు తీసుకొచ్చారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.


