ఇన్ సర్వీసు టీచర్లను టెట్ నుంచి మినహాయించాలి
● టీచర్స్ ఫెడరేషన్ మాజీ రాష్ట్ర కార్యదర్శి వెంకటపతిరాజు విజ్ఞప్తి
పాడేరు రూరల్: ఇన్ సర్వీసు ఉపాధ్యాయులను టెట్ నుంచి మిన హాయించాలని టీచర్స్‌ఫెడరేషన్ మాజీ రాష్ట్ర కార్యదర్శి బి. వెంకటపతిరాజు డిమాండ్ చేశారు. టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు జగన్‌మోహనరావు ఆధ్వర్యంలో ఆదివారం పాడేరులో నిర్వహించిన జిల్లా సబ్ కమిటీ సమవేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల నెలకొన్న ప్రధాన సమస్యలు పరిష్కరించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇప్పటికే పలు మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా కనీస స్పందన లేదన్నారు. నూతన విధానాలతో ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులు టెట్‌లో ఉండాలని ఆంక్షలు విధించడం సరికాదన్నారు. పీఆర్సీ క మిటీ ఏర్పాటుచేసిన ఐఆర్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాలనుంచి మిహయింపు ఇవ్వడమే కాకుండా వివిధ రకాల ఒత్తిడిలను తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా ప్రధా న కార్యదర్శి ధనుంజయ్, ఉపాధ్యక్షులు శ్యాంసుందర్, నాగేశ్వరరావు,చిన్నారావు పాల్గొన్నారు.


