పల్స్‌పోలియో విజయవంతం
● జిల్లావ్యాప్తంగా 94 శాతం మేర చిన్నారులకు చుక్కల మందు
● డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తినాయక్
పాడేరు : జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతమైందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 64 పీహెచ్‌సీల పరిధిలో 1,29,959 మందిలో 94శాతం మేర 1,15,654 మంది చిన్నారులకు చుక్కల మందు వేసినట్టు ఆయన పేర్కొన్నారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమాన్ని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి పరిశీలించారు. చిన్నారులకు ఆమె చుక్కల మందు వేశారు.
డుంబ్రిగుడ (అరకులోయ టౌన్): అరకులోయ గిరిజన మ్యూజియం వద్ద ఏర్పాటుచేసిన కేంద్రంలో చిన్నారులకు స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో రహిత సమాజం నిర్మించి చిన్నారులను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. వైద్యాధికారులు కమల, సిబ్బంది పాల్గొన్నారు.
రెండు చుక్కలు చిన్నారులకు రక్షణ : ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర
ముంచంగిపుట్టు: చిన్నారుల బంగారు భవిష్యత్తుకు రెండు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మండల కేంద్రంలోని పోలియో చుక్కల కేంద్రాలను ఆదివారం సందర్శించిన ఆమె చిన్నారులకు చుక్కలమందు వేశారు. వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, రెండు చుక్కలు చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు దోహదపడతాయని అన్నారు. ఎంపీపీ సీతమ్మ, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు పద్మారావు, వైద్యులు నిఖిల్, వివేక్, శ్యాంప్రసాద్, సీహెచ్‌వో శౌరి తదితరులు పాల్గొన్నారు.
చింతూరు డివిజన్‌లో 10,848 మందికి..
చింతూరు: జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా చింతూరు డివిజన్లో 0 నుంచి 5 ఏళ్లలోపు 10,848 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్టు డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ పుల్లయ్య తెలిపారు. ఎర్రంపేట ఎంపీపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో చింతూరు ఏఎస్పీ బొడ్డు హేమంత్ చిన్నారికి పోలియో వ్యాక్సిన్ వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పల్స్‌పోలియో విజయవంతం
పల్స్‌పోలియో విజయవంతం
పల్స్‌పోలియో విజయవంతం


