రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో అనకాపల్లి బాలికల
కర్నూలు (టౌన్): స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి 44 వ షూటింగ్ బాల్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. పురుషుల విభాగంలో బాపట్ల జిల్లా జట్టు మొదటి స్థానం, నెల్లూరు జిల్లా జట్టు రెండో స్థానం సాధించాయి. బాలికల విభాగంలో అనకాపల్లి జిల్లా జట్టు మొదటి స్థానం, బాపట్ల జిల్లా జట్టు రెండో స్థానం సాధించాయి. ముగింపులో ఒలింపిక్ అసోసియేషన్ సీఈఓ విజయ్‌కుమార్, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగమణి, ఒలింపిక్ సంఘం కార్య నిర్వహణ కార్యదర్శి సునీల్‌కుమార్, కార్పొరేటర్ లక్ష్మీకాంత రెడ్డి పాల్గొన్నారు. విజేతలకు మెడల్స్, కప్పులను అందజేసి అభినందించారు. జిల్లా షూటింగ్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి ఈశ్వర్‌నాయుడు, కేడీసీసీ మాజీ డైరెక్టర్ రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


