గాయపడిన హెచ్‌ఎం ఝాన్సీ చికిత్స పొందుతూ మృతి
పాయకరావుపేట : బస్సెక్కుతుండగా డ్రైవర్ అజాగ్రత్త వల్ల కిందపడి గాయపడిన ఎస్.నర్సాపురం జెడ్పీహెచ్ స్కూల్ హెచ్‌ఎం ఎం.ఝాన్సీ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు సీఐ జి.అప్పన్న, ఎంఈవో రమేష్‌బాబు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. హెచ్‌ఎం ఎం.ఝాన్సీ (62) 20 వ తేదీ శనివారం పాఠశాలలో విధులు ముగించుకుని సాయంత్రం 5.30 గంటలకు పాయకరావుపేట ఆర్‌టీసీ బస్ స్టాండ్‌కి వచ్చి అనకాపల్లి వెళ్లడానికి పల్లె వెలుగు బస్సు ఎక్కారు. బస్ డ్రైవర్ అజాగ్రత్తగా బస్సును ముందుకు తీసుకెళ్లడంతో ఆమె పుట్‌పాత్ నుంచి కాలు ఇరుక్కుపోయి కిందపడిపోయారు. వెంటనే ఆమెను ఉపాధ్యాయులు తుని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించి అక్కడ నుంచి విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆమె చికిత్స పొందుతూ ఆదివారం శనివారం రాత్రి 2.30 గంటలకు మృతి చెందారు.
గాయపడిన హెచ్‌ఎం ఝాన్సీ చికిత్స పొందుతూ మృతి


