డ్రగ్స్ అనర్థాలపై అవగాహన
సీలేరు: జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్‌కు దూరం ఉండాలని అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుందని ఇది విద్యార్ధి దశ నుంచే అలవరచుకోవాలని జెన్‌కో ఇంజనీర్ రాజేంద్రప్రసాద్ అన్నారు. సీలేరులోని ఏపీ జెన్‌కో కల్యాణ మండపంలో ఆదివారం డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌ఐ ఎండీ యాసిన్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్ధాలను దూరంగా ఉండి, చదువుతో పాటు సృజనాత్మకత కార్యకలాపాలపై దృష్టి సారించాలని సూచించారు. స్థానిక గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు డి.సునీల్ మరియు భానుప్రకాష్ మరియు స్థానిక యువత సహకారంతో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఏపీ జెన్‌కో రిటైర్డ్ ఎస్‌ఈ చంద్రశేఖర్ రెడ్డి , ఎంపీటీసీ సభ్యుడు సాంబమూర్తి , జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శంకరరావు పాల్గొన్నారు.
డ్రగ్స్ అనర్థాలపై అవగాహన


