ఘనంగా హిందూ సమ్మేళనం
జి.మాడుగుల: ప్రజలంతా భక్తిభావంతో దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలని ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత ప్రసార ప్రముఖ్ ఆదిత్య తెలిపారు. మండలంలో సొలభం పంచాయతీ గొడుగుమామిడి గ్రామంలో భక్తిశ్రద్ధలతో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భీమిలికి చెందిన సద్గురు సాయిరాం స్వామీజీ మాట్లాడుతూ హైందవ ధర్మ పరిరక్షణకు అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రామనికి హాజరైన అతిథులకు గిరిజన సంప్రదాయంగా అడ్డాలకుతో తయారు చేసిన గిడుగులతో సన్మానించారు. విల్లంభులను అందజేశారు. థింసా నృత్యాలు, కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎస్‌ఎస్‌ఎఫ్ జిల్లా పరియోజన ప్రముఖ్ మత్స్యరాస మత్స్యరాజు, ఎస్‌ఎస్‌ఎఫ్, ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు కొండబాబు, లక్ష్మి, నీలకంఠం, భాస్కరరావు, వరహాలమ్మ, కొండమ్మ తదితరులు పాల్గొన్నారు.
దేవీపట్నం: మండలంలోని చినరమణయ్యపేట పంచాయతీ గుబ్బలంపాలెం ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో ఆదివారం హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ఠ అతిథిగా విచ్చేసిన పిఠాపురానికి చెంఇన విశ్వానంద భారతి దత్తస్వామి మాట్లాడుతూ దేశ సమైక్యత కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని, మత మార్పిడులు, మత విద్వేషాలు నిరోధించాలన్నారు. పులిబోను నాగరాజు, యర్రమళ్ల శ్రీను, ముండ్రు నాగశ్రీ, రావిపాటి గోవిందరావు, కట్టుమూరి గాంధీ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా హిందూ సమ్మేళనం


