అలరించిన రాష్ట్ర స్థాయి ఎడ్లబళ్ల పోటీలు
చీడికాడ : మాజీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా చుక్కపల్లిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్లబళ్ల పోటీలు అలరించాయి. పోటీలను మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. జగన్‌మోహన్‌రెడ్డి దార్శనికుడని, అందువల్లనే ఆయన జన్మదినం అంటే పల్లెల్లో మందస్తు సంక్రాంతి పండగేనన్నారు. పోటీల నిర్వాహకులను అభినందించారు. విజయనగరం, ఉమ్మడి విశాఖ,తూ.గో జిల్లాలకు చెందిన 27 ఎడ్ల బళ్లు పోటీల్లో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో చీడికాడ, దేవరాపల్లి వైఎసా్‌స్‌ర్‌సీపీ అధ్యక్షుడు గొల్లవిల్లి రాజుబాబు, బూరే బాబురావు, దేవరాపల్లి జెడ్పీటీసీ కర్రి సత్యం,సర్పంచ్ మజ్జి లక్ష్మణమ్మ, ఎంపీటీసీ సుంకర లక్ష్మి, యూత్ అధ్యక్షుడు గొల్లవిల్లి స్వామినాయుడు, పార్టీ నేతలు పాల్గొన్నారు. పోటీల్లో మాడుగుల మండలం కె.జె.పురానికి చెందిన కొయిలాడ మోహన్ బండి ప్రథమస్థానంలో నిలిచి బహుమతి గెలుచుకుంది. రెండవ స్థానంలో శ్రీ పరదేసిమాంబ వావిలపాడు బండి నిలిచింది. విజేతలకు మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గొల్లవిల్లి రాజుబాబు,సర్పంచ్ మజ్జి లక్ష్మణమ్మ, ఎంపీటీసీ సభ్యులు సుంకర లక్ష్మీ, బాయిశెట్టి వెంకటరమణ, సకలా రమణ,పెంటకోట ఈశ్వరరావు బహుమతులు ప్రదానం చేశారు.
అలరించిన రాష్ట్ర స్థాయి ఎడ్లబళ్ల పోటీలు
అలరించిన రాష్ట్ర స్థాయి ఎడ్లబళ్ల పోటీలు


