జన నీరాజనం.. జగన్మోహనం
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపుట్టినరోజు వేడుకలు జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటాయి. పార్టీ శ్రేణులు, అభిమానుల కోలాహలంతోవాడవాడలా పండుగ వాతావరణంనెలకొంది. కేవలం వేడుకలకే పరిమితంకాకుండా విస్తృత సేవా కార్యక్రమాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఊరూరా కేక్ కటింగ్‌లు, సంబరాలు మిన్నంటాయి.
పాడేరు : జిల్లా కేంద్రం పాడేరులో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మోదకొండమ్మ తల్లి ఆలయంలో ఆయనతోపాటు, అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, పార్టీ నేతల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే , వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అద్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, వైఎస్సార్‌సీపీ శ్రేణుల సమక్షంలో కట్ చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిభిరాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, జగనన్న అభిమానులు, మహిళలు, ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు రక్తాన్ని సేకరించారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు క్యాంపు కార్యాలయంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
బాలసదనంలో ..
పట్టణంలోని ప్రభుత్వ బాలసదనంలో జన్మదిన వేడుకలను మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హ్యాపీ బర్త్ డే జగనన్న అంటూ చిన్నారులు ప్లకార్డులతో శుభాకాంక్షలు తెలిపారు. వారి సమక్షంలో బర్త్‌డే కేక్‌ను ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్, యువజన విభాగం రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి చెట్టి వినయ్, మహిళా విభాగం అధ్య క్షురాలు కురుసా పార్వతమ్మ, జిల్లా ప్రధాన కార్యద ర్శి సీదరి మంగ్లన్నదొర, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు లోచలి వరప్రసాద్, ఐటీ విభాగం జిల్లా అద్యక్షుడు కూడా సుబ్రమణ్యం, ప్రచార కమిటీ రాష్ట్ర కార్యదర్శి కూతంగి సూరిబాబు, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, మహిళ విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు కిల్లో ఊర్వశిరాణి, పార్టీకి చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
డుంబ్రిగుడ/(అరకులోయ టౌన్): స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఆయన ఎమ్మెల్సీ కుంభా రవిబాబుతో కలిసి ఇక్కడి నాలుగు రోడ్ల జంక్షన్‌లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. పార్టీ కార్యాలయంలో కూడా శ్రేణులు, అభిమానుల సమక్షంలో మరో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం వంద మంది మహిళలకు చీరలు, పురుషులకు వస్త్రాలు అందజేశారు. ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ దమ్మున్న నాయకుడు మన జగనన్న అందరికీ అండగా ఉంటారన్నారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, ఎస్టీసెల్ రాష్ట్ర కార్యదర్శి చిన్నరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పాలు, నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్చార్జ్ విజయ్, ఉమ్మడి విశాఖ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమ్మిడి ఆశోక్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిరి రవిప్రసాద్, అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట మండల పార్టీ అధ్యక్షులు కొర్ర సూర్యనారాయణ, స్వాభీ రామూర్తి, పాంగి పరశురామ్, పాంగి అనిల్, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగభూషణ్, నియోజకవర్గం గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు సందడి కొండబాబు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
రాజవొమ్మంగి: వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి జనరంజక పాలనను ప్రజలు మరువలేదు అని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే, పార్టీ రంపచోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జి నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. రాజవొమ్మంగి గాంధీబొమ్మ సెంటర్లో ఆదివారం నిర్వహించిన జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లయినా కొత్తగా ఒక్కరికి కూడా పింఛను మంజూరు చేయలేదన్నారు. ఉపాధి వేతన దారులకు ఆరు నెలలుగా వేతనాలు అందజేయలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ అరాచక పాలన ఇక ఎన్నాళ్లో సాగదని హెచ్చరించారు. గతంలో ఎమ్మెల్యే వస్తున్నారంటే గ్రామాల్లో ప్రజలు నీరాజనాలు పట్టే వారని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. రానున్నది మన జగనన్న ప్రభుత్వమే అని వారు పేర్కొన్నారు. పేదలకు రగ్గులు, మిఠాయిలు పంచిపెట్టారు. పార్రీట మండల అధ్యక్షుడు సింగిరెడ్డి రామకృష్ణ, ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, సర్పంచ్‌లు కొంగర మురళీకృష్ణ, చీడి శివ, సవిరెల చంద్రుడు, ఎంపీటీసీలు గంగదుర్గ, చంద్రరాణి పాల్గొన్నారు.
జనం గుండెల్లో చెరగని ముద్ర
ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర
ముంచంగిపుట్టు: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలి వద్ద వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు పాంగి పద్మారావు ఆధ్వర్యంలో ఆమె, మండల నేతలు బర్త్‌డే కేక్‌ను కట్ చేశారు. స్థానిక హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక సీహెచ్‌సీలో రోగులకు పాలు,రొట్టెలు పంచి పెట్టారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్న పాలనలో పేద,బడుగు బలహీన వర్గాలను సంక్షేమ పాలన అందిస్తే నేడు ఆయా వర్గాలను టీడీపీ ప్రభుత్వం క్షోభకు గురి చేస్తోందని విమర్శించారు. ,రాష్ట్ర ప్రజలంతా మళ్లీ జగనన్న పాలన కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సీతమ్మ, వైస్‌ఎంపీపీ భాగ్యవతి, సర్పంచులు రమేష్,బాబూరావు, నీలకంఠం,వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి జగబంధు,ఎంపీటీసీ సుబ్బలక్ష్మి, కమల, మండల వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు.
జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన జగనన్న పుట్టినరోజు వేడుకలు
వాడవాడలా సేవా కార్యక్రమాలు,
రక్తదాన శిబిరాలు నిర్వహణ
పేదలకు అన్నదానం
కోలాహలంలో వెల్లివిరిసిన పండగ వాతావరణం
జన నీరాజనం.. జగన్మోహనం
జన నీరాజనం.. జగన్మోహనం
జన నీరాజనం.. జగన్మోహనం
జన నీరాజనం.. జగన్మోహనం


