పోటెత్తిన పర్యాటక లోకం
పాడేరు : ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వంజంగి మేఘాల కొండకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. శనివారం రాత్రి నుంచి వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు పాడేరు తరలివచ్చారు. వంజంగి, పాడేరులోని హొటళ్లు, రిసార్టులు, క్యాంపెయిన్ టెంట్లలో బస చేశారు. ఆదివారం తెల్లవారు జామున నాలుగు గంటలకు వంజంగి మేఘాల కొండపై క్యూ కట్టడంతో రద్దీ నెలకొంది. వేకవజామున సూర్యోదయ అందాలు, మంచు అందాలను తిలకించారు. ప్రకృతి అందాల మధ్య సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. వంజంగి హిల్స్‌ను ఆదివారం సుమారు 2,500మంది సందర్శించినట్టు అంచనా.
చింతపల్లి: ప్రముఖ పర్యాటక కేంద్రం లంబసింగికి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. చెరువుల వేనం వ్యూపాయింట్ వద్ద ప్రకృతి అందాలను తిలకించారు. తాజంగి జలాశయం వద్ద సాహస క్రీడల్లో పాల్గొని సందడి చేశారు.
జి.మాడుగుల: కొత్తపల్లి జలపాతానికి ఆదివారం పలు ప్రాంతాల నుంచి భారీగా సందర్శకులు తరలివచ్చారు. ప్రత్యేక వాహనాల్లో రావడంతో సందడి వాతావరణం నెలకొంది. బండరాళ్లపై నుంచి ప్రవహించే జలపాతంలో స్నానాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. సెల్ఫీలు, ఫొటోలు తీసుకున్నారు.
డుంబ్రిగుడ: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయి జలవిహారికి భారీగా పర్యాటకులు తరలివచ్చారు. గిరిజన వస్త్రధారణతో సంప్రదాయ థింసా నృత్యాలు చేస్తూ సందడి చేవారు. జలపాతంలో స్నానాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. బ్యాంబూ బిరియాని, బ్యాంబూ చికెన్ అమ్మకాలు భారీగా జరిగాయి.
వజంగి మేఘాల కొండకు
పోటెత్తిన పర్యాటకులు
భారీగా తరలివచ్చిన సందర్శకులు
పోటెత్తిన పర్యాటక లోకం
పోటెత్తిన పర్యాటక లోకం
పోటెత్తిన పర్యాటక లోకం
పోటెత్తిన పర్యాటక లోకం


