విద్యుత్ ఆదాపై అవగాహన
జి.మాడుగుల: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఏపీ ట్రాన్స్‌కో ఏఈ వెంకటరమణ, తహసీల్థార్ రాజ్‌కుమార్, ఎంపీడీవో డేవిడ్‌రాజ్ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ ఆదాపై అవగాహన కలిగి ఉండాలన్నారు. స్టార్ రేటింగ్ ఉన్న విద్యుత్ పరికరాలను వినియోగించాలన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న సోలార్ ప్లాంట్‌లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంఈవో బాబూరావుపడాల్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ విజయ్‌కుమార్, విద్యుత్ శాఖ ఏఈ సుబ్రమణ్యం, ఎల్‌ఐ షాజహాన్, లైన్‌మేన్‌లు మొహిద్దీన్, జోగిరాజు, దొర పాల్గొన్నారు.
చింతపల్లి: ఇందన పొదుపు వారోత్పవాలు ముగింపు కార్యక్రమంలో భాగంగా చింతపల్లిలో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా విద్యుత్‌శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కోట్ల సన్నిరాంబాబు మాట్లాడుతూ విద్యుత్ అనవసరంగా వాడుకోకుండా పొదుపుగా వాడుకోవడం వలన సొమ్ము ఆదా అవుతుందన్నారు.తహసీల్దార్ శంకరరావు, ఏఈఈ ప్రభాకరరావు, లైన్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, తదితరులు పాల్తొన్నారు.
విద్యుత్ ఆదాపై అవగాహన


