విద్యార్థులు పఠనాశక్తి పెంపొందించుకోవాలి
రంపచోడవరం: ప్రభుత్వం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ముస్తాబు కార్యక్రమాన్ని ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ శనివారం ఇర్లపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు చదువుతున్న పాఠశాలల్లో రోజు ఉదయం లేవగానే కాలకృత్యాలు అనంతరం, స్నానాపానాలు చేసి అల్పాహారం తీసుకున్న తరువాత తరగుతులకు వెళ్లే ముందు ముస్తాబు కావాలన్నారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు శ్రద్దగా విని చదువులో రాణించాలన్నారు. వ్యక్తిగత శుభ్రతపై దృష్టి సారించాలన్నారు. డీడీ రుక్మాండయ్య, ఏటీడబ్ల్యూ శంభుడు ,హెచ్‌ఎం రాజేశ్వరి పాల్గొన్నారు.
చింతూరు: చిన్న, చిన్న అలవాట్లు మార్చుకోవడం ద్వారా పెద్ద మార్పులు సాధ్యపడతాయని చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ అన్నారు. స్థానిక గురుకుల పాఠశాలలో శనివారం ఆయన ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా పీవో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రశ్నించే స్వభావాన్ని పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థుల పఠనాశక్తిని పెంపొందించేందుకు వంద రోజుల ప్రణాళికను ఖచ్చితంగా అమలు చేయాలని, ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన ఆదేశించారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఏపీవో రామతులసి, ప్రిన్సిపాల్ సుభ్రహ్మణ్యం పాల్గొన్నారు.
డుంబ్రిగుడ: మండలంలోని కిల్లోగుడ ఇంగ్లిష్ మీడియం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో శనివారం ముస్తాబు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్ధినులకు వ్యక్తిగత పరిశుభ్రతపై హెచ్‌ఎం సుజాత అవగాహన కల్పించారు.
విద్యార్థులు పఠనాశక్తి పెంపొందించుకోవాలి
విద్యార్థులు పఠనాశక్తి పెంపొందించుకోవాలి


