బకాయి వేతనాలు చెల్లించాలి
అడ్డతీగల: వేతన బకాయిలతో పాటు ఇతర ఆర్ధిక ప్రోత్సాహకాలను వెంటనే చెల్లించాలని కోరుతూ వైద్య ఉద్యోగులు శనివారం అడ్డతీగల మండలం ఎల్లవరం పీహెచ్‌సీ ఎదుట నిరసన చేపట్టారు.యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రంపచోడవరం డివిజన్ అధ్యక్షురాలు పి.సత్యవతి, ఉపాధ్యక్షుడు బి.దుర్గారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.రాజవొమ్మంగి మండలం లాగరాయి పీహెచ్‌సీలో పనిచేస్తున్న ఇద్దరు ఫార్మసిస్టులకు 13 మాసాలుగా జీతాలు చెల్లించడం లేదన్నారు. క్షేత్రస్ధాయి సిబ్బందికి నాలుగేళ్లుగా ఎఫ్‌టిఎ, యూనిఫాం అలవెన్సులు చెల్లించడం లేదన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అందజేయాల్సిన ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పదోన్నతులను కూడా కల్పించకుండా ఆర్డీ కార్యాలయం అధికారులు అన్యాయం చేస్తున్నారన్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించాలని లేకుంటే ప్రజాస్వామికంగా రాజ్యాంగబద్దంగా మా ఆందోళనను తీవ్రతరం చేస్తామన్నారు.


