కొనసాగుతున్న చలి, మంచు
చింతపల్లి: జిల్లాలో చలి, మంచు తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. శనివారం జి.మాడుగులలో 4.7 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 5.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.
● పాడేరు డివిజన్ పరిధి అరకువ్యాలీలో 5.8 డిగ్రీలు, చింతపల్లిలో 6.5 డిగ్రీలు, పాడేరులో 6.7 డిగ్రీలు, పెదబయలులో 6.9 డిగ్రీలు, హుకుంపేటలో 7.7 డిగ్రీలు, డుంబ్రిగుడలో 9.1 డిగ్రీలు, కొయ్యూరులో 12.7 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన పేర్కొన్నారు.
● రంపచోడవరం డివిజన్ మారేడుమిల్లిలో 9.9 డిగ్రీలు, వై. రామవరంలో 10.6 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 13.4 డిగ్రీలు, అడ్డతీగలలో 14.3 డిగ్రీలు, గంగవరంలో 15.0 డిగ్రీలు, రంపచోడవరంలో 15.3 డిగ్రీలు, చింతూరు డివిజన్‌లో ఎటపాకలో 13.1 డిగ్రీలు, చింతూరులో 13.7 డిగ్రీలు నమోదు అయినట్టు ఏడీఆర్ పేర్కొన్నారు.
● వారం రోజులుగా జిల్లావ్యాప్తంగా శీతల గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది.దీంతో అన్నివర్గల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచు తెరలు ఉదయం 9గంటల వరకు వీడటం లేదు.
డుంబ్రిగుడ: మండలంలో చలితీవ్రతకు ప్రజలు వణికిపోతున్నారు.గురువారం 3.8 డిగ్రీలు, శుక్రవారం 4.4 డిగ్రీలు, శనివారం 9.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. చలిమంటలు కాగుతూ ఉపశమనం పొందుతున్నారు.
జి.మాడుగులలో 4.7,
ముంచంగిపుట్టులో 5.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
చింతపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ అప్పలస్వామి వెల్లడి
కొనసాగుతున్న చలి, మంచు


