చలి, మంచుతో ఇబ్బందులు
● స్థిరంగా కనిష్ట ఉష్ణోగ్రతలు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చలి, మంచు తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ముంచంగిపుట్టు 5.9, జి.మాడుగులలో 7.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్‌లో పెదబయలు 8.3, అరకువ్యాలీలో 8.8, పాడేరు, చింతపల్లిలో 9.2, హుకుంపేటలో 9.9, కొయ్యూరులో 12.3 డిగ్రీలు నమోదయ్యాయి. రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 10.6, మారేడుమిల్లిలో 11.0, రాజవొమ్మంగిలో 12.8, అడ్డతీగలలో 14.3, రంపచోడవరంలో 14.6, గంగవరంలో 16.2 ఉష్ణోగ్రతలు నమోదు కాగా చింతూరు డివిజన్‌లో చింతూరు 14.1, ఎటపాకలో 14.6 డిగ్రీలు నమోదు అయినట్టు ఏడీఆర్ తెలిపారు.


