వ్యవసాయ వృద్ధి రేటు 17.5 శాతం పెంపునకు కృషి
సహాయ సంచాలకుడు తిరుమలరావు
చింతపల్లి: రాబోయే మూడు సీజన్‌ల్లో వ్యవసాయ వృద్ధిరేటును 17.5 శాతానికి పెంచేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు వ్యవసాయ సహాయ సంచాలకుడు తిరుమలరావు తెలిపారు. స్థానిక వ్యవసాయాధికారి కార్యాలయం వద్ద సోమవారం వ్యవసాయ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకే పొలంలో వివిధ పంటల సాగు, పంట మార్పిడి విధానంలో అధిక ఆదాయం ఇచ్చే పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించనున్నట్టు చెప్పారు. ఈ ఏడాది రబీలో సుమారు వంద ఎకరాల్లో అదనంగా వేరుశెనగ సాగు చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో లు టి.మధు, గిరి, బీహెచ్‌ఈఎల్‌లు పాల్గొన్నారు.


