న్యాయ సహాయకుల పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం
విశాఖ లీగల్: నగరంలోని న్యాయ సేవా ప్రాధికార సంస్థలో న్యాయ సహాయకులుగా పనిచేయడానికి అర్హులైన న్యాయవాదుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవా ప్రాధికార సంస్థ చైర్మన్ చిన్నంశెట్టి రాజు తెలిపారు. డిఫెన్స్ కౌన్సిల్‌గా సేవలందించడానికి మూడు కేటగిరిలో న్యాయవాదులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ప్రధాన, ఉప న్యాయ సహాయకులు, లీగల్ అసిస్టెంట్ల పోస్టులకు ఈ నెల 31వ తేదీలోగా న్యాయ సేవా ప్రాధికార సంస్థలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు జిల్లా కోర్టు వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని తెలిపారు.


