అమర జవాన్లకు ఘన నివాళి
ఏయూక్యాంపస్: 1971 యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన అద్భుత విజయానికి గుర్తుగా మంగళవారం నగరంలో ‘విజయ్ దివస్’ వేడుక లు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీచ్ రోడ్డులోని విక్టరీ ఎట్ సీ వద్ద అమర జవాన్లకు ఘన నివాళులర్పించారు. కార్యక్రమానికి హాజరైన డైరెక్టర్ జనరల్ నేవల్ ప్రాజెక్ట్స్, వైస్ అడ్మిరల్ కె.శ్రీనివాస్.. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.


