పాఠశాలలో తనిఖీలు
అడ్డతీగల: అడ్డతీగలలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను ఎంపీడీవో ఎ.వి.వి.కుమార్ సోమవారం సందర్శించారు. 420 మంది విద్యార్థినులున్న పాఠశాలలో స్టాక్ రిజిష్టర్ పరిశీలించగా 6,185 కిలోల బియ్యం నిల్వ ఉన్నాయన్నారు. స్టాక్ రిజిష్టర్ ప్రకారం కందిపప్పు 32 కిలోల 500 గ్రాములు ఉండాలన్నారు.కానీ 30 కిలోల 180 గ్రాములు ఉందన్నారు. ఆయిల్ 40 ప్యాకెట్లకుగాను 36 ప్యాకెట్లు మాత్రమే ఉన్నాయన్నారు.చింతపండు, బెల్లం నిల్వలు లేవన్నారు. పాలుకు సంబంధించి ఈనెల 1 నుంచి సోమవారం వరకూ నమోదు చేయలేదన్నారు.46 మరుగుదొడ్లు ఉండగా కేవలం 10 మరుగుదొడ్లు మాత్రమే పనిచేస్తున్నాయన్నారు.స్నానాల గదులు 34 మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. ఏడుగురు వర్క ర్లకు ఐదు మంది మాత్రమే పనిచేస్తున్నారన్నారు.పరిశీలనలో గమనించిన అంశాలను నివేధిక రూపంలో ఉన్నతాధికారులకు పంపించామన్నారు.


