జాతీయ స్థాయి కరాటే పోటీలకు ముగ్గురు బాలికల ఎంపిక
కొయ్యూరు: పెదమాకవరం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఎంపికయ్యారు. అనపర్తిలో రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కోచ్‌లు బోయిని నాగేశ్వరరావు,మర్రి శ్రీను పర్యవేక్షణలో ఆదివారం రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పెదమాకవరం పాఠశాలకు చెందిన సోమెల కీర్తి, లోచెల రాజ్యలక్ష్మి వెండి పతకాలు, దేవరాజు దుర్గాలక్ష్మి కాంస్య పతకం సాధించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.ఈ ముగ్గురిని సోమవారం పాఠశాల హెచ్‌ఎం సంధ్య, ఉపాఽధ్యాయులు అభినందించారు.


