ఉత్సాహంగా 5కే మారథాన్
● డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నిర్వహణ
● వంజంగి మేఘాల కొండపై
ప్రారంభించిన ఎస్పీ అమిత్‌బర్దర్
● పాల్గొన్న గిరి యువత
పాడేరు : నిషేధిత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు గిరిజన యువత దూరంగా ఉండి ఆరోగ్యకరమైన స్వేచ్ఛా జీవితం గడపాలని ఎస్పీ అమిత్‌బర్దర్ సూచించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఆదివారం ఉదయం వంజంగి మేఘాల కొండ దిగువ ప్రాంతం నుంచి కొండపైకి సుమారు ఐదు కిలోమీటర్ల మేర 5కే రన్ నిర్వహించారు. ఎస్పీ అమిత్‌బర్దర్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది గిరిజన యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గిరిజన యువత, విద్యార్థులు ప్రభుత్వం అందజేసే సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని మంచిగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. ప్రాథమిక విద్య దశ నుంచి మంచి క్రమ శిక్షణ అలవరచుకోవాలన్నారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని గ్రామాల్లో ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారికి అవగాహన కల్పించాలని సూచించారు. అప్పటికి మాట వినకపోతే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు డీఎస్పీ సహబాజ్ అహ్మద్, సీఐ దీనబంధు, పోలీసు సిబ్బంది, గిరిజన యువత పాల్గొన్నారు.


