రెండేళ్ల చిన్నారికి చూపు
● శంకర్ ఫౌండేషన్ శస్త్రచికిత్స
సింహాచలం : రెండేళ్ల చిన్నారికి చూపు ప్రసాదించి వెలుగులు నింపింది నాయుడుతోటలోని శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి. ఆసుపత్రి డీజీఎమ్ బంగార్రాజు తెలిపిన వివరాల ప్రకారం... చింతపల్లి సమీపంలోని తాడిబండ గ్రామానికి చెందిన రెండేళ్ల గిరిజన బాలిక ఇంటి దగ్గర ఆడుకుంటూ పడిపోవడంతో కంటికి తీవగ్రాయమై రక్తస్త్రావం జరిగింది. బాలికను చింతపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు విశాఖలోని ప్రాంతీయ కంటి ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ వైద్యులు చిన్నారిని పరీక్షించి అత్యవసర కంటి శస్త్రచికిత్స అవసరమని శంకర్ ఫౌండేషన్‌కి పంపించారు. శంకర్ ఫౌండేషన్‌లో కార్నియా విభాగాధిపతి డాక్టర్ నస్రిన్ నేతృత్వంలో డాక్టర్ వి.కె.యశస్విని శస్త్రచికిత్స చేశారు. చిన్నారికి కంటి చూపును ప్రసాదించారు. చిన్నారి పూర్తిగా కోలుకోవడంతో డిశార్జ్ చేశారు.


