ప్రజా సమస్యల పరిష్కారం వేగవంతం | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారం వేగవంతం

Nov 22 2025 7:30 AM | Updated on Nov 22 2025 7:30 AM

ప్రజా

ప్రజా సమస్యల పరిష్కారం వేగవంతం

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

పీజేఆర్‌ఎస్‌లో 151 వినతుల స్వీకరణ

పాడేరు : ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని వేగవంతం చేయాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజేఆర్‌ఎస్‌) నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పలు సమస్యలపై 151 వినతులను ఆయన స్వీకరించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని అప్లోడ్‌ చేయాలని ఆదేశించారు. అర్జీదారుడు ఇచ్చిన అర్జీ ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు 1100 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. కాల్‌ సెంటర్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ మురళి, జిల్లా వ్యవశాయ శాఖ అధికారి నందు, జిల్లా ఖజానా అధికారి ప్రసాద్‌, జిల్లా పరిశ్రమల అధికారి రమణరావు, పలు శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

గ్రామ బహిష్కరణపై ఫిర్యాదు

మెటల్‌ క్వారీ కారణంగా జరుగుతున్న నష్టంపై రంపచోడవరం ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేసినందుకు ఓ కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేశారని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ దృష్టికి తెచ్చారు. శుక్రవారం ఐటీడీఏలో నిర్వహించిన మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో బాధిత కుటుంబంతో వచ్చి ఫిర్యాదు చేశారు. రంపచోడవరం మండలం నర్సాపురం, దిసిరిపల్లి గ్రామాల్లో బినామీ పేరిట నాన్‌ ట్రైబ్స్‌ మెటల్‌ క్వారీలను నిర్వహిస్తున్నారని వీటి కారణంగా ఆ రెండు గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. ఈ విషయాన్ని దిసరిపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం అధికారుల దృష్టికి తెస్తే గ్రామ బహిష్కరణ చేయడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన కలెక్టర్‌ను కోరారు.

ప్రజా సమస్యల పరిష్కారం వేగవంతం1
1/1

ప్రజా సమస్యల పరిష్కారం వేగవంతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement