రిసార్ట్స్‌ నిర్వాహకులపైచర్యలకు డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

రిసార్ట్స్‌ నిర్వాహకులపైచర్యలకు డిమాండ్‌

Apr 1 2026 7:42 AM | Updated on Apr 1 2026 7:42 AM

పాడేరు రూరల్‌: రూప రిసార్ట్స్‌ నిర్వాహకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని (సీఆర్పీఎఫ్‌)బాలల పరిరక్షణ వేదిక రాష్ట్ర కో–కన్వీనర్‌ కాంగు శుభ(చిన్ని) డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ అరకులోయకు చెందిన రూప ప్రైవేట్‌ రిసార్ట్స్‌ నిర్వాహకులు అమాయక గిరిజనులను టార్గేట్‌ చేసుకుని గంజాయి రవాణా చేస్తున్నారన్నారని ఆరోపించారు. గతంలో ఇదే రూప రిసార్ట్స్‌ నిర్వాహకులు స్థానిక కొంతమంది గిరిజన యువకులకు డబ్బులు ఆశ చూపించి అరకులోయ ప్రాంతం నుంచి గంజాయి రవాణా చేయిస్తుండగా విజయవాడలో పట్టుబడ్డారన్నారు. వారిపై కేసు నమోదైనప్పటికీ రిసార్ట్స్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇందులో భాగంగా రిసార్ట్స్‌ని కూడా సీజ్‌ చేయాల్సి ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యంతో నామమాత్రంగా సుమోటుగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారన్నారు. ఈ విషయంపై ఇటీవల కలెక్టర్‌, ఐటీడీఏ పీవోకు ఫిర్యాదులు కూడా చేశామన్నారు. సానుకులంగా స్పందించిన వారు తక్షణం చర్యలకు ఆదేశాలిస్తామని హమీ ఇచ్చిన్నట్టు ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement