ఆత్మీయ సన్మానం | - | Sakshi
Sakshi News home page

ఆత్మీయ సన్మానం

Apr 1 2026 7:42 AM | Updated on Apr 1 2026 7:42 AM

చింతపల్లి: ఉన్నత సేవలతోనే మంచి గుర్తింపు ఉంటుందని ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి అన్నారు. లంబసింగి గిరిజన సంక్షేమ బాలకల ఆశ్రమ పాఠశాలలో పదవీ విరమణ పొందిన పీజీ హెచ్‌ఎం (పానల్‌ గ్రేడ్‌ హెచ్‌ఎం) జక్కు శంకరరావు దంపతులను దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడిచిన 34 ఏళ్లుగా గిరిజన ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ జక్కు శంకరరావు ఎంతో అంకితభావంతో పనిచేశారని కొనియాడారు.

ఎంతోమంది గిరిజన విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారన్నారు. ఉన్నత ఉపాధ్యాయుడిగా గుర్తింపు తెచ్చుకోగలగారన్నారు. ఈ సందర్భంగా పలువురు శంకరరావు సేవలను కొనియాడారు. పీజీ హెచ్‌ఎంలు రాజు, సాగిన రామరాజు పడాల్‌, సింహాచలం, రాజంనాయుడు, పూర్వ విద్యార్థులు నూకరాజు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement