పాడేరు : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద భద్రపరిచిన ఈవీఎం గోదాములను కలెక్టర్ దినేష్‌కుమార్ మంగళవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీలు చేశారు. ఈవీఎం గోదాముల వద్ద ప్రధాన ద్వారం సీల్ ఓపెన్ చేయించి గదుల్లో భద్రంగా ఉన్న ఈవీఎంలను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి క్షుణ్ణుంగా తనిఖీలు చేసి అక్కడ పరిస్థితులను గమనించారు. సీసీ కెమెరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈవీఎం గోదా ములను సీల్ వేయించారు, అక్కడ భద్రతగా ఉన్న పోలీస్ సిబ్బందికి పలు సలహాలు, సూచనాలు చేశా రు. అనంతరం విజిటింగ్ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఆయన వెంట తహసీల్దార్ బి.అరుణ్‌చంద్ర, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లక్ష్మయ్య, ఎలక్షన్ సెల్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులున్నారు.


