ఉపాధి పనుల కల్పనలో అలసత్వం వహిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఉపాధి పనుల కల్పనలో అలసత్వం వహిస్తే చర్యలు

Apr 1 2026 7:42 AM | Updated on Apr 1 2026 7:42 AM

డుంబ్రిగుడ: ఉపాధి హామీ పనుల ప్రగతి, కల్పనలో అలసత్యం వహిస్తే చర్యలు తప్పవని డ్వామా పీడీ విద్యాసాగర్‌ అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో 16వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదికను మంగళవారం నిర్వహించారు. ఎంపీపీ బాకా ఈశ్వరి సమక్షంలో పనులు వివరాలను వివరించారు.ఉపాధి హామీ, పంచాయతీరాజ్‌, గిరిజన సంక్షేమశాఖ, సామాజిక పింఛన్లపై సామాజిక తనిఖీల వివరాలతో ప్రజావేదికను నిర్వహించారు. 2024–25 మార్చి 31 వరకు జరిగిన పనులపై సమగ్ర వివరాలతో ప్రజావేదికలో పొందుపరిచారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో వేతన రూపంలో రూ 29.46 కోట్లు, మెటీరియల్‌ రూపంలో రూ 74.21 లక్షలతో కలిపి రూ.30.20 కోట్ల పనులు, పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా రూ.2.98కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.14.68 కోట్లతో పనులు జరిగినట్టు వెల్లడించారు. జాబ్‌కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి పనులు కల్పించాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వైస్‌ ఎంపీపీ ఆనంద్‌రావు, ఏపీడీ పవన్‌కుమార్‌, ఇన్‌చార్జి ఎంపీడీవో విశ్వనాథ్‌, ఏపీవోలు సంగంనాయుడు, దొరబాబు, గిరిజన, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు అజయ్‌కుమార్‌, అభిషేక్‌, ఎన్‌ఆర్‌జీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

డ్వామా పీడీ విద్యాసాగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement