● భారీగా తరలివచ్చిన సందర్శకులు
● కిటకిటలాడిన పర్యాటక ప్రాంతాలు
పాడేరు : మన్యంలో పర్యాటక సీజన్ ప్రారంభంతో పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఆదివారం సెలవు కావడంతో పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడాయి. వంజంగి మేఘాల కొండకు పర్యాటకులు పోటెత్తారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా తరలివచ్చారు. ప్రకృతి అందాలు తిలకించేందుకు వేకువజామునుంచి బారులు తీరారు. ఇటీవల మేఘాల కొండను స్వాధీనం చేసుకున్న అటవీశాఖ టోల్‌గేట్‌ను ఏర్పాటుచేసింది. ప్రవేశరుసం ద్వారా రూ.65,080 ఆదాయం వచ్చింది.
కుటుంబసమేతంగా కలెక్టర్ సందడి
కలెక్టర్ దినేష్‌కుమార్ కుటుంబ సభ్యులతో వంజంగి మేఘాల కొండను సందర్శించారు. కొండపైనుంచి మేఘాలు, ప్రకృతి అందాలను తిలకించారు. కుటుంబ సభ్యులతో ఫొటోలు తీసుకున్నారు. ప్రకృతి అందాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని, సహజసిద్ధ అందాలకు నిలయమని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ అటవీశాఖ ఆధ్వర్యంలో అన్ని రకాల వసతులు సమకూర్చుతున్నామని కలెక్టర్ తెలిపారు.
జి.మాడుగుల: ప్రముఖ పర్యాటక ప్రాంతం కొత్తపల్లి జలపాతానికి ఆదివారం పలు ప్రాంతాల నుంచి సందర్శకులు భారీగా తరలివచ్చారు. రోజంతా స్నానాలు చేస్తూ సందడి చేశారు. వ్యూపాయింట్ జలపాతాల వద్ద సెల్ఫీలు, ఫొటోలు దిగారు. ప్రకృతి ఆందాలను ఆస్వాదిస్తూ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో ఎంజాయ్ చేశారు.
డుంబ్రిగుడ: పర్యాటక ప్రాంతాలు చాపరాయి, అరకు పైనరీ పర్యాటకుల రాకతో కిటకిటలాడాయి. చాపరాయి జలవిహారికి భారీగా తరలిరావడంతో ప్రవేశ రుసుం ద్వారా శనివారం రూ.71,150, ఆదివారం రూ.1,03,830 ఆదాయం సమకూరిందని నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ గిరిజన వస్త్రధారణలో పర్యాటకులు ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. అరకు పైనరీని శనివారం 758, ఆదివారం 860 మంది సందర్శించినట్టు అటవీశాఖ అధికారవర్గాలు తెలిపాయి.
చింతపల్లి: ఆంధ్రా కశ్మీర్ లంబసింగికి పర్యాటకుల తాకిడి నెలకొంది. ఆదివారం తెల్లవారుజామునుంచి భారీగా తరలివచ్చారు. చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద పాల సముద్రాన్ని తలపించే ప్రకృతి అందాలను తిలకించారు. ఫొటోలు తీసుకుని సందడి చేశారు. తాజంగి జలాశయం వద్ద సాహస క్రీడల్లో పాల్గొని ఎంజాయ్ చేశారు.
అరకు పైనరీకి తరలివచ్చిన పర్యాటకులు
చెరువులవేనం వ్యూ పాయింట్ వద్ద అందాలను తిలకిస్తున్న పర్యాటకులు
వంజంగి హిల్స్ ముఖద్వారం వద్ద పర్యాటకుల సందడి
మన్యానికి పండగొచ్చింది
మన్యానికి పండగొచ్చింది
మన్యానికి పండగొచ్చింది
మన్యానికి పండగొచ్చింది
మన్యానికి పండగొచ్చింది


