ఆటో బోల్తా పడి యువకుడి మృతి
కొయ్యూరు: వంట చెరకు సేకరణను వెళ్లిన ఆటో తిరిగి వస్తుండగా బ్రేకులు ఫెయిల్ కావడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన ఆర్.కల్యాణ్ చక్రవర్తి అలియాస్ చిన్న(33) అక్కడికక్కడే మరణించాడు. సమాచారం తెలుసుకున్న కొయ్యూరు ఎస్‌ఐ కిషోర్‌వర్మ వెంటనే ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణాదేవిపేటకు చెందిన ఎం.అప్పారావు, వి.బుచ్చియ్య, ఎం.కొండబాబు, చిన్న కలిసి మంగళవారం ఆటోలో కృష్ణాదేవిపేట నుంచి కొయ్యూరు–ఎర్రబంద రహదారిలో ఏనుగురాయి వద్దకు వెళ్లి వంట చెరకు సేకరించారు. తిరిగి వస్తుండగా బ్రేకులు ఫెయిల్ కావడంతో ఆటో బోల్తా పడింది. చిన్న తలకు తీవ్ర గాయాలు కావడంతో సంఘటన స్థలంలోనే మరణించారు. గాయపడిన వారిలో అప్పారావు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వై ద్యం కోసం నర్సీపట్నం ఏరి యా ఆస్పత్రికి తరలించారు. మిగతా ఇద్దరూ కృష్ణాదేవిపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆటో బోల్తా పడి యువకుడి మృతి


