
నిర్వాసితులకు తీరని వేదన
స్టీల్‌ప్లాంట్‌లో చోటుచేసుకున్న ప్రస్తుత పరిస్థితులు నిర్వాసితులకు తీరని వేదనను మిగిల్చాయి. ప్లాంట్ నిర్మాణం కోసం తమ భూములు, ఇళ్లు ఇచ్చినవారిని ఇప్పుడు నిర్వాసితులు కాదనే కొత్తవాదనను స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ముందుకు తెచ్చారు. కేవలం ఆర్ కార్డు ఉన్నవారు మాత్రమే నిర్వాసితులని, వారి వారసులు నిర్వాసితులు కాదని పేర్కొనడంతో నిర్వాసితులను పని నుంచి తొలగించడం సులువైపోయిందని కంపెనీవర్గాలు పేర్కొంటున్నాయి. కేవలం ఎంప్లాయిమెంట్ ద్వారా విధుల్లో చేరిన 250 మందిని మాత్రమే నిర్వాసితులుగా పరిగణించి మిగిలిన వారిని విధుల నుంచి తొలగించారని కార్మికులు చెబుతున్నారు.