టీఎఫ్‌ఆర్ జిల్లా కార్యవర్గం ఎన్నిక
పాడేరు రూరల్: జిల్లా కేంద్రం గిరిజన ఉద్యోగుల సంఘం భవనంలో మంగళవారం ట్రెబల్ రైట్స్ ఫోరం(టీఎఫ్‌ఆర్) అల్లూరి జిల్లా కార్యవర్గం ఎన్నిక నన్నయ్య యూనివర్సిటీ ప్రొఫెసర్, ఫోరం వ్యవస్థాపకుడు డాక్టర్ ఆర్.ఎస్.వరహాలదొర ఆధ్వర్యంలో జరిగింది. ఫోరం జిల్లా అధ్యక్షుడిగా పి.సతీష్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా జర్సింగి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా పి.అప్పలస్వామి, జి.నాని, సహాయ కార్యదర్శులుగా బోనంగి వెంకట్‌పడాల్, పి.చలపతి, కోశాధికారిగా జాగరపు చలపతి, లీగల్ అడ్వైజర్ పొయిభ నీలకంఠం, కగ్రీవంగా ఎన్నిక కాగా.. మరో ఐదుగురు బోర్డు సభ్యులుగా నియామకమయ్యారు. అనంతరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ప్రధాన సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గం సభ్యులు పూర్ణారావు, నరసింహదొర, భానుచందర్, పాల్గొన్నారు.


