
కూలి పనులు దొరకడం లేదు
ఇక్కడ వ్యవసాయ కూలి పనులు దొరకడం లేదు. ఆధార్ కార్డు ఇక్కడ అడ్రస్‌కు మార్చక పోవడంతో మాకు ఉపాధి హామీ పథకంలో పనులు కల్పించడం లేదు.సొంతూరు వదిలి వచ్చిన మమ్మల్ని ఐటీడీఏ, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సర్వం కోల్పోయిన తమ పట్ల ఇలా వ్యవహరించడం ఏమాత్రం సరికాదు.
– నూతి రమేష్, ములకపల్లి
ముంపు భూములిచ్చారు
భూమికి భూమిగా కన్నాయిగూడెం పంచాయతీలో ఐదు ఎకరాలు ఇచ్చారు. అయితే ఈఏడాది వచ్చిన గోదావరి వరదలకు మూడుసార్లు ముంపునకు గురైంది. పత్తిపంట నాశనమైంది. ఎరువులు, పశువుల దాణా కూడా ఇవ్వడం లేదు. అధార్ అడ్రస్ మార్చకపోవడంతో ఇక్కడ పంచాయతీకి చెందిన వారు కాదంటున్నారు.
– కెచ్చల సుబ్బారెడ్డి, కల్తునూరు
రేషన్‌కు రూ.300 ఖర్చు
కాలనీకి వచ్చి రెండేళ్లుగా నివాసం ఉంటున్నా. ఇప్పటి వరకు మా రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇక్కడికి మార్చలేదు. ప్రతి నెలా కల్తునూరు వెళ్లి రేషన్ బియ్యం తెచ్చుకునేందుకు రూ.300 రవాణా ఖర్చులు బరాయించాల్సి వస్తోంది. రేషన్ తెచ్చుకోకపోతే కార్డు అక్కడ ఇక్కడ లేకుండా పోతుందని భయపడుతున్నాం.
– రమణమ్మ, కల్తునూరు
పనికిరాని భూమిచ్చారు
పది సంవత్సరాల క్రితం ఇక్కడ నాలుగు ఎకరాల భూమి ఇచ్చారు. అయితే ఆభూమిలో ఉన్న జామాయిల్ చెట్లు కూడా నేటికి తొలగించకపోవడంతో ఆ భూమిలో ఏ పంట వేయాలన్నా ఇబ్బందిగా మారింది. అధికారులు ముందు చెప్పిన మాటలు నేటికి నెరవేర్చకుండా మోసం చేయడం ఏమాత్రం సరికాదు.
– కెచ్చల వెంకటేశ్వరరెడ్డి,
కల్తునూరు

కూలి పనులు దొరకడం లేదు

కూలి పనులు దొరకడం లేదు

కూలి పనులు దొరకడం లేదు