
గిరిజనులకు మెరుగైన వైద్యసేవలే లక్ష్యం
● మాతాశిశు ఆరోగ్యసేవలపై ప్రత్యేక దృష్టి
● డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తినాయక్
సాక్షి, పాడేరు: గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందంచడమే లక్ష్యంగా పనిచేయడంతో పాటు, మాతాశిశు ఆరోగ్య సేవలపై ప్రత్యేకంగా దృష్టి పెడతానని డీఎంహెచ్‌వో డాక్టర్ డి.కృష్ణమూర్తినాయక్ తెలిపారు. డీఎంహెచ్‌వోగా ని యమితులైన ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తానన్నారు. డోలీమోతలను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూ పొందిస్తామన్నారు. పీహెచ్‌సీల వైద్యులు,ఇతర సిబ్బంది, 108, బైక్ అంబులెన్స్‌ల సిబ్బంది స మన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటా నని తెలిపారు.అన్ని గ్రామాల్లో మాతాశిశు మరణాల నిరోధానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రసూతి తేదీకి వారం రోజుల ముందుగానే గర్భిణులను దగ్గరలో ఉన్న ప్రసూతి కేంద్రాలకు తరలించాలని వైద్యబృందాలను ఆదేశించారు.అన్ని పీహెచ్‌సీల్లో అత్యవసర మందులు,వ్యాక్సిన్‌లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.