
బ్యూటీ సెలూన్ ముసుగులో వ్యభిచారం
కూర్మన్నపాలెం: దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూర్మన్నపాలెం వద్ద ‘లవిషి బ్యూటీ సెలూన్’ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు శుక్రవారం రాత్రి ఈ సెలూన్‌పై దాడి చేయగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు నిర్వాహకులు, ఒక సహాయకుడు, ముగ్గురు విటులు పట్టుబడ్డారు.ఈ సెలూన్‌ను రాజీవ్‌నగర్‌కు చెందిన కిల్లాడ ప్రవీణ్, పార్కు హోటల్ వద్ద నివాసముంటున్న య. పురపు దమయంతి, గాజువాక కుంచమాంబ కాలనీకి చెందిన కొసనం హైమవతి నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరికి రాజీవ్‌నగర్‌కు చెందిన అమిత్ గౌతమ్ సహకరిస్తున్నాడన్నారు. ఈ దాడిలో నిర్వాహకులు, ముగ్గురు విటులతో సహా మొత్తం ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు. ఈ కేసులో పట్టుబడిన బాధితురాలైన మహిళను సేఫ్ కస్టడీకి పంపించినట్లు పోలీసులు తెలిపారు.