
ఆట, పాటలతో బోధించాలి
డుంబ్రిగుడ: ఆట, పాటలు, కథల రూపంలో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా చదువు నేర్పించాలని జిల్లా విద్యాశాఖధికారి బ్రహ్మాజీరావు ఉపాధ్యాయులకు సూచించారు. మండల కేంద్రం డుంబ్రిగుడలో ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణకార్యక్రమాన్ని ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువులో వెనకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి, వారికి అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలని చెప్పారు. సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఎంఈవో శెట్టి సుందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
సీసీఎల్ మంజూరు
రెండవ శనివారం సెలవు దినం కావడంతో శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులకు సీసీఎల్ మంజూరు చేయాలని యూటీఎఫ్ నాయకులు కోరారు. ఈ మేరకు డీఈవోను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు సీసీఎల్ మంజూరు చేయడంతో ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు ఎస్. బాలకృష్ణ, జిల్లా కార్యదర్శి ఎస్.కన్నయ్య, ఆడిట్ కమిటీ సభ్యులు రఘనాథ్, కార్యదర్శి రాజారావు తదితరులు పాల్గొన్నారు.
హుకుంపేట: విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు సూచించారు. స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయుల శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు అర్థమైన రీతిలో బోధన చేయాలని తెలిపారు. ఎంఈవోలు సోమేలి చెల్లయ్య,ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఆట, పాటలతో బోధించాలి