
‘ధన్ ధాన్య కృషి యోజన’తో వ్యవసాయ రంగానికి మేలు
మాట్లాడుతున్న ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి
ప్రధానమంత్రి ప్రసంగాన్ని వీక్షిస్తున్న కలెక్టర్ దినేష్‌కుమార్,ఇతర అధికారులు
సాక్షి,పాడేరు: జిల్లాలో పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం అమలుతో వ్యవసాయ ఉత్పాదకత పెంపునకు దోహదపడుతుందని కలెక్టర్ దినేష్‌కుమార్ అన్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రారంభించిన కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వంద జిల్లాల్లో అమలుకానున్న ఈ పథకానికి జిల్లా ఎంపిక కావడం శుభపరిణామమన్నారు. ఆరేళ్లపాటు అమలు కావడంతో వ్యవసాయ రంగం మరింత అభివృద్ధికి ఈ పథకం ఎంతో మేలు చేస్తుందన్నారు.నీటి పారుదల సౌకర్యాలతో పాటు లాభసాటి పంటల సాగు, పంటల మళ్లింపు, ప్రకృతి వ్యవసాయంలో అంతరపంటల సాగుకు ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఏడాది పొడవునా పంటల సాగు, ఆదాయ వనరుల పెంపు, వ్యవసాయ అనుబంధ విభాగాల బలోపేతం జరుగుతాయన్నారు. జిల్లా వ్యవసాయ అభివృద్ధికి రైతులంతా సంఘాలుగా ఏర్పడి పంటల సాగు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక చైర్మన్ వంపూరు గంగులయ్య తదితరులు పాల్గొన్నారు.
అనుబంధ రంగాల్లో రైతులు వృద్ధి సాధించాలి : ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి
రంపచోడవరం: గిరి రైతులు వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణించాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి కోరారు. శనివారం పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రంలో పీఎం ధన్ –ధాన్య కృషి యోజన కార్యక్ర మం నిర్వహించారు. కేవీకే కోఆర్డినేటర్, సీనియర్ శాస్త్రవేత్త రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పప్పు ధాన్యాల వృద్ధి, వ్యవసాయ అనుబంధ రంగాలపై రైతులు దృష్టి సారించాలన్నారు. ఎంపీపీ బందం శ్రీదేవి, జెడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి, పీహెచ్‌వో దేవదానం, సర్పంచ్ లక్ష్మీదేవి, కేవీకే శాస్త్రవేత్తలు వీరాంజనేయులు, ఏడీఏ రామ్మోహన్‌రావు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్

‘ధన్ ధాన్య కృషి యోజన’తో వ్యవసాయ రంగానికి మేలు